: రాష్ట్రపతి, ప్రధానిని కలిసే యోచనలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారికి నివేదించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు కొంతసేపటి కిందట బాబు హైదరాబాదులోని తన నివాసంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.