: కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, బీహార్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత దేవేంద్ర ప్రసాద్ యాదవ్ గతరాత్రి ఢిల్లీలో కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో గత నెల 22న ఆయన ఆసుపత్రిలో చేరారు.
దేవేంద్ర ప్రసాద్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1971 నుంచి 77 వరకు మంత్రిగా సేవలు అందించారు. రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన అంత్యక్రియలు బీహార్లోని ముంగర్ లో జరుగుతాయి.