: తెలంగాణ అంశంపై నేడు రాజ్యసభలో చర్చ
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ అంశంపై నేడు సుదీర్ఘ చర్చ జరగనుంది. అనంతరం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేస్తారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ కొన్ని రోజులుగా సభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్న క్రమంలో చర్చ జరుగుతుందని గతవారం కేంద్రమంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు.