: పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
భూమిపై 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల పృథ్వి-2 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి దీనిని ఈ ఉదయం ప్రయోగించారు. ఈ క్షిపణిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.