: సరిహద్దులో మరోసారి పాక్ కాల్పులు


దాయాది దేశం పాకిస్థాన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత సైనికులే లక్ష్యంగా గత అర్ధరాత్రి పాక్ సైన్యం మరోసారి జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ వద్ద కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ కె కలియా చెప్పారు. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వద్ద రెండుసార్లు కాల్పులకు పాల్పడిన పాక్, ఐదుగురు భారత జవాన్ల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News