: భారీ భూకంపంతో వణికిన ఇండోనేషియా
ఈ తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపంతో ఇండోనేషియా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. నైరుతి ప్రాంతంలోని సౌమల్కి దీవులకు 189 కిలోమీటర్ల దూరంలో, సముద్రం లోపల 98 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 నిమిషాల పాటు సమీప ప్రాంతాలలో ప్రకంపనాలు వచ్చినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు.