: లక్షమంది అక్కడికి వెళతారట!


అంగారక గ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. అక్కడ నివసించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఎంతమంది అంటే సుమారుగా లక్షమంది. ఎందుకంటే అన్ని అప్లికేషన్లు వచ్చాయి మరి. అంగారక గ్రహంపై నివసించాలని ఆశపడేవారు సుమారు లక్షమందిదాకా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడో విశేషమేమంటే అక్కడికి వెళ్లడమేకానీ తిరిగి రావడం ఉండదట.

నాసా నేతృత్వంలో మార్స్‌ వన్‌ అనే ప్రాజెక్టు ఒక కొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో 2022 నాటికి అంగారకుడిపై ఆవాసం ఏర్పాటు చేయడం. ఈ ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందట. ఎంతగా అంటే అరుణుడిపై ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి లక్షమంది దరఖాస్తులు చేసుకున్నారట. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏమంటే అంగారకుడిపైకి వెళ్లే టిక్కెట్టు మాత్రమే తిరుగు టికెట్టు ఉండదు. అయితే అంగారకుడిపై ఎలాంటి వాతావరణం ఉంది అనే విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు.

అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న అంగారకుడిపై ప్రజలు ఎలా మనుగడ సాగిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నా... మరోవైపు అక్కడ నివసించేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దరఖాస్తుదారులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంది. ఎంతమంది దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లించారు? అనే విషయాన్ని చెప్పడానికి మాత్రం మార్స్‌ వన్‌ సీఈవో బాస్‌ లాన్స్‌డ్రావ్‌ నిరాకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News