: ప్రస్తుతం దేశానికి ఎన్టీఆర్ లాంటి నాయకుడు కావాలి: నరేంద్ర మోడీ


ప్రస్తుతం ఎన్టీఆర్ లాంటి నేత దేశానికి కావాలని మోడీ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అంటూ ప్రజల కడుపు నింపేదుకు ప్రయత్నం చేశారని, ఆయన ఆదర్శంగా నేతలు పని చేయాలని సూచించారు. ప్రజలకు మంచి చేసేందుకు ఆయన లాంటి చిత్తశుద్ధి కలిగిన నేతలే దేశానికి కావాలని మోడీ ఆకాక్షించారు. ఎన్టీఆర్ వల్లే కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నెలకొల్పడం దేశానికి సాధ్యమైందని మోడీ ఎన్టీఆర్ ను ప్రస్తుతించారు.

తమిళ నాడు రాష్ట్రాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ఎంతో నేర్చుకోవాలని సూచించారు. ఉన్నత విద్యావంతులు, మేధావులు దేశం విడిచి వెళ్లడం ప్రమాదకరమని అన్నారు. తెలంగాణ కు జై కొట్టిన నరేంద్ర మోడీ, సీమాంధ్రకు కూడా జై కొట్టారు. తెలంగాణకు తాము అనుకూలమన్నామని, సీమాంధ్రులకు అన్యాయం జరగడానికి వీలు లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ కు పది రెట్లు ఉత్తమమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని తెలిపారు.

తాను గుజరాత్ నుంచి వచ్చానని, గాంధీ, సర్థార్ వల్లభాయి పటేల్ జన్మించిన ప్రాంతం నుంచి వచ్చానని తాను మాటిస్తున్నానని తెలిపారు. నేను రెండు ప్రాంతాల ప్రజలను అడగాలనుకుంటున్నాను. భవిష్యత్తులో మన మార్గమేంటని ప్రశ్నించారు. అమ్మ పాలలో కల్తీ ఉండనట్టే మీ రెండు ప్రాంతాల ప్రజలూ సోదరులని తెలిపారు. మీ మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెస్సే అని తెలిపారు.

గుజరాత్ లో 6 లక్షల మంది తెలుగు ప్రజలు ఉంటున్నారు. వారితో గుజరాతీలంతా సోదరుల్లా ఉంటున్నామని తెలిపారు. ప్రజలందరి కడుపు నింపేందుకు, అందరి ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అనంతరం సభికులతో 'అవును, నేను చేయగలను. అవును చేస్తాను. జై తెలంగాణ, జై సీమాంధ్ర, భారత్ మాతాకీ, వందే మాతరం' నినాదాలు చేయించారు.

  • Loading...

More Telugu News