: సోదర సోదరీ మణులారా నమస్కారం: తెలుగులో మోడీ పలకరింపు
నవభారత యువభేరీలో నరేంద్ర మోడీ ముందుగా తెలుగులో పలకరించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఎవరో రాసిచ్చిన తెలుగు వాక్యాలను తమాషాగా చదువుతూ, తెలుగు వారి మనసులు దోచుకున్నారు. ఆయన తెలుగు ప్రసంగం సాగిందిలా... "సోదర సోదరీ మణులారా... భారత దేశ ప్రగతికి తెలుగువారి కృషి ప్రశంసనీయం. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని శ్రీవెంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రం, దేశం క్లిష్ట పరిస్థితుల్లో వున్నాయి. మీ రాష్ట్రం ఆ పరిస్థితుల్లోంచి బయటకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ది రావాలని కోరుతున్నాను. గుజరాత్ తో తెలుగువారి సంబంధాలు పురాతనమైనవి. అందుకే అక్కడ తెలుగు మీడియం స్కూల్స్ నడుస్తున్నాయని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.