: హైదరాబాద్ లో టిఫిన్ బాక్సు కలకలం
జంట పేలుళ్ల ప్రభావం నగరంపై ఇంకా తొలగినట్టులేదు! బేగంపేట వద్ద అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ టిఫిన్ బాక్సు కలకలం రేపింది. బేగంపేట గ్రీన్ లాండ్ ఫ్లై ఓవర్ వద్ద టిఫిన్ బాక్సులో బాంబు ఉన్నట్టు వదంతులు గుప్పుమన్నాయి. హుటాహుటీన అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ వెంటనే తనిఖీలు నిర్వహించింది. అయితే అందులో బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.