: మహాత్ముడి సమాధికి భద్రతా దళాల కాపలా


అహింసా సూత్రం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఎదురైంది. 67వ స్వాంతంత్ర్య దినోత్సవం ముందుగా ఈ నెల 1 నుంచే ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలను కేంద్ర హోంశాఖ నియమించింది. ఇక్కడి యమునా నదీ తీరాన మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తదితరుల సమాధులు ఉన్నాయి. వీటికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడం వల్లే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. గాంధీ మరో లోకం నుంచి దీన్ని చూడగలిగితే.. తాను కలగన్న భారతావని స్థితిని చూసి ఆయన మనసు బాధతో నిండిపోతుందేమో!

  • Loading...

More Telugu News