: జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎల్లుండి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపడతారని మంత్రి శైలజానాధ్ తెలిపారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్సీపీకి ఇప్పటికీ స్పష్టత లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటించేశాం, చర్చలు లేవు అనే స్థాయి నుంచి చర్చల స్థాయికి తీసుకువచ్చామని, అలాగే రాష్ట్ర విభజనను కూడా ఆపుతామని శైలజానాథ్ తెలిపారు. ఈ గందరగోళానికంతా కారణం నేతలేనని, గతంలో సీమాంధ్రలో అసలు ఉద్యమమే లేదని తెలిపారని అధిష్ఠానానికి నివేదికలిచ్చారన్నారు. ఉద్యమమే లేకపోతే ఇప్పుడు రోడ్లెక్కుతున్నది ఎవరని ప్రశ్నించారు. ప్రజానాడిని నేతలు గమనించడంలో విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.