: రాజీనామాల కంటే.. సభ అడ్డుకోవడం ద్వారానే ఎక్కువ ఫలితం: మోదుగుల


రాజీనామాలు చేసి రోడ్ల మీదకి వచ్చే కంటే పార్లమెంటులో సభా కార్యక్రమాలు అడ్డుకోవడం ద్వారానే ఎక్కువ ఫలితం సాధించొచ్చని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ 24 మంది సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ బిల్లు అడ్డుకోవాలని సూచించారు. ఆంటోనీయే కాదు, ఏ కమిటీలను నమ్మి సీమాంధ్ర ప్రజలు మోసపోరని అన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ఆహార భద్రత బిల్లు ప్రవేశపెడుతున్నారని మోదుగుల మండిపడ్డారు.

  • Loading...

More Telugu News