: నిజాలు బయటకు రాకూడదనే జైట్లీ నిర్బంధం: మోడీ


కిష్టావర్ జిల్లాలో అలర్ల వెనుకనున్న నిజాలు బయటకు రాకుండా చేసేందుకే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరుణ్ జైట్లీని నిర్బంధించిందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. జైట్లీ బృందాన్ని జమ్మూ పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమంటూ ఖండించారు. కిష్టావర్ లో అల్లర్ల వెనుకనున్న కారణాలను తెలుసునేందుకే జైట్లీ బృందం అక్కడకు వెళ్లిందని, అక్కడి వాస్తవ పరిస్థితిని ప్రజలకు వెల్లడించడమే వారి పర్యటన ఉద్దేశంగా చెప్పారు. అల్లర్ల వెనుకనున్న వాస్తవాలు బయటకు తెలియకుండా చేసేందుకే ప్రభుత్వం ప్రతిపక్షాలను అడ్డుకుంటోందన్నారు.

  • Loading...

More Telugu News