: పార్టీలను ఆర్టీఐ చట్టం నుంచి తప్పించే బిల్లు సిద్ధం


రాజకీయ పార్టీలు తమ వ్యవహారాలు గుట్టుగా ఉండాలని కోరుకుంటున్నాయి. తమకొచ్చే విరాళాలు సహా ఇతర విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి పార్టీలు రాకుండా సవరణలతో బిల్లును రూపొందించింది. దీనిని కేంద్ర ప్రభుత్వం రేపు లోక్ సభలో ప్రవేశపెడుతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ తదితర పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రీయ సమాచార కమిషన్ రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేయడంతో పార్టీలలో వణుకు మొదలైంది. ఇందుకు అవకాశం లేకుండా కేంద్రం సమాచార హక్కు చట్టానికి సవరణలు తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News