: స్పీకర్ మీరా కుమార్ ను కలిసిన సీఎం
రాష్ట్ర పర్యటనలో ఉన్న లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ అతిథి గృహంలో ఉన్న ఆమెతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం.