: మోడీతో మందకృష్ణ భేటీ


నవభారత యువభేరిలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పలువురు ప్రముఖులు కలుసుకుంటున్నారు. పోలీసులు పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అనుమతినిస్తుండడంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా పార్క్ హయత్ హోటల్ లో ఉన్న మోడీని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిసారు. వీరి భేటి ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్న మందకృష్ణ మాదిగ బీజేపీ ఆశాకిరణాన్ని కలవడం వెనుక ఆంతర్యమేమిటన్నది ఆసక్తి గొలుపుతోంది.

  • Loading...

More Telugu News