: సీమాంధ్ర 14 యూనివర్సిటీల విద్యార్థుల సమావేశం
సీమాంధ్రలో ఉన్న 14 విశ్వవిద్యాలయాల విద్యార్ధులు నెల్లూరులో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమ, విద్యార్థుల పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చ జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన ప్రకటన నేపధ్యంలో విద్య, ఉద్యోగావకాశాలపై ప్రభావం, వనరులు, ఉపాధి అవకాశాలు వంటి వాటిని కులంకషంగా చర్చించుకుని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఉన్న అవకాశాలను చర్చిస్తున్నారు.