: నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.