: రగులుతున్న కాశ్మీరం


జమ్మూలోని కిష్టావర్ ప్రాంతంలో ఈద్ పండగనాడు ఇరు మత వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు ఇంకా శాంతించలేదు. దీంతో ముందు జాగ్రత్తగా జమ్మూ, రాజౌరి, ఉధంపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. కిష్టావర్ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ఆందోళనకారులు షాపులు, వాహనాలను దహనం చేయాలని చూశారని జమ్మూ పోలీస్ కమిషనర్ శరత్ మను తెలిపారు. దీంతో జమ్మూ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు చెప్పారు.

మరోవైపు బీజేపీ జాతీయ నేత అరుణ్ జైట్లీ మత అల్లర్లు జరిగిన కిష్టావర్ జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ఆయనతోపాటు పలువురు ఎంపీలు కూడా అల్లర్లు జరిగిన ప్రాంతాలలో పరిస్థితిని పరిశీలిస్తారు. గతంలోలా హిందువులను సంబంధిత ప్రాంతం నుంచి తరిమేసే వ్యూహంలో భాగంగానే అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ భావిస్తోంది. పరిస్థితిని వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News