: ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం: తులసిరెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటోందో ముఖ్యమంత్రి విపులీకరించారని, ఆయన ఏ ప్రాంతానికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజల అభిప్రాయానికి సీఎం మద్దతు తెలిపారని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కేసీఆర్ కాకమ్మ కధలు చెప్పారని విమర్శిచారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రాంతాల నేతలూ ఉన్నారని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే తమ పార్టీ వ్యవహరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచేందుకు సీమాంధ్ర ప్రాంతంలో స్వచ్ఛందంగా జరుగుతున్న ఆందోళనలు సహకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.