: ముంబయి పేలుళ్ల హంతకులను శిక్షించే వరకు విశ్రమించం: కేంద్రం


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాక్ మాటలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. 1993 ముంబయి పేలుళ్లకు కారకులైన వారికి శిక్ష పడేంత వరకూ భారత్ విశ్రాంతి తీసుకోదని ఆ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఢిల్లీలో తెలిపారు. దావూద్ ఆనుపానులపై పాక్ సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని, అయితే, పేలుళ్లకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. కేసులో దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంటామన్నారు.

  • Loading...

More Telugu News