: టీమిండియా పేసర్లకు మెక్ గ్రాత్ ట్రైనింగ్


భారత్ పేసర్లు ఒక్కోసారి ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపైనా రాణించలేకపోవడం చూస్తుంటాం. కారణం సుస్పష్టం. అలాంటి పిచ్ లపై ఎక్కడ బంతులేస్తే బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడతారో తెలియకపోవడమే. స్వదేశంలో పచ్చికతో కూడిన పిచ్ లు కలలో కూడా ఊహించలేం. ఇక వారికి పేస్ బౌలింగ్ కళ ఏ విధంగా అలవడుతుంది? అందుకే, టీమిండియా స్పీడ్ స్టర్లకు ఆసీస్ పేస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రాత్ తో శిక్షణ ఇప్పించాలని బీసీసీఐ భావిస్తోంది. బంతిని వికెట్ కి ఇరువైపులా నాట్యమాడించడంలో సిద్ధహస్తుడైన మెక్ గ్రాత్ ప్రస్తుతం చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కు కోచింగ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. మెక్ తో త్వరలోనే బీసీసీఐ ఈ దిశగా ఒప్పందం కుదుర్చుకోవచ్చని భారత క్రికెట్ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News