: బాంబు పేలుళ్ల దర్యాప్తులో కీలక మలుపు


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బాంబు పేలుడుకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గర సైకిల్ నిలిపిన 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు సీసీ కెమెరా వీడియోల్లో గుర్తించారు.

బాంబు పేలుడుకు ముందు సైకిల్ పై వచ్చిన ఆ వ్యక్తి.. పది నిమిషాల తర్వాత నడిచి వెళ్లడం వీడియోల్లో స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News