: కుమార్తెకు షారూఖ్ సలహా
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోయిజానికి ఆద్యుడిగా నిలిచిన షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానాకు ఏం సలహా ఇచ్చాడో చూడండి. ఆమె ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో స్నేహం చేయాలనుకుంటే తనలాంటి వాణ్ణి ఎంచుకోవాలని సూచిస్తున్నాడు. తననో ఆదర్శ మిత్రుడిగా అభివర్ణించుకున్న షారూఖ్, తన పట్ల మహిళాభిమానులు ప్రదర్శించే ప్రేమకు కారణాలు చెప్పాడు. 'అందరి ప్రేమకు నోచుకోదగిన మంచి వ్యక్తినే. బాగా చదువుకున్నవాణ్ణి. పైగా, నేస్తాలను పువ్వుల్లోపెట్టి చూసుకుంటా. ఇక మా అమ్మాయికి ఒకటే చెబుతాను, నా కోపతాపాలను పక్కనబెడితే, బాయ్ ఫ్రెండ్ ని ఎంచుకుంటే నాలాంటి వాణ్ణే ఎంపిక చేసుకోమంటాను. మా అమ్మాయికే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయికైనా ఇదే చెబుతాను' అని విపులీకరించాడు.