: టీడీపీ ఎంపీలు కమల్ హాసన్ ను మించిపోయారు: దాడి
రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిస్థితులపై వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు స్పందించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ఎంపీలు నటనలో కమల్ హాసన్ ను మించిపోయారని ఎద్దేవా చేశారు. వారు రాజీనామాల పేరిట నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలూ అందుకు మినహాయింపు కాదన్నారు. సీమాంధ్రలో నడుస్తున్న ఉద్యమంతో అధిష్ఠానం దిగివచ్చిందని, అందుకే కమిటీ వేసిందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దాడి అన్నారు. ఆఖరికి సీఎం కిరణ్ కూడా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తప్పుబట్టారని గుర్తు చేశారు.