: 12 నుంచి విధుల బహిష్కరణే.. సీమాంధ్ర ఉద్యోగుల తీర్మానం
సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రులు కలసిరాకపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి విధులను బహిష్కరించాలని సీమాంధ్ర ఉద్యోగులు తీర్మానించారు. ప్రజాప్రతినిధుల తీరుతెన్నులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేవని, పార్టీలన్నీ కుమ్మక్కయి రాష్ట్రాన్ని, తెలుగు జాతిని ముక్కలు చేయడానికి నిర్ణయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, 12 అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించి, నేతల రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావాలని రాజమండ్రిలో జరిగిన సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమావేశంలో తీర్మానించారు.