: వచ్చేవారం భారత పర్యటనకు భూటాన్ ప్రధాని
భూటాన్ నూతన ప్రధాని షేరింగ్ తోబే వచ్చేవారం భారత పర్యటనకు రానున్నారు. గత నెలలోనే షేరింగ్ భూటాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన తొలి విదేశీ పర్యటన భారత్ తో ఆరంభించనున్నారు. ఈ పర్యటనలో భారత్ నుంచి తగినంత ఆర్థిక సహకారాన్ని రాబట్టడమే ప్రధానాంశంగా ఆయన చర్చలు సాగించే అవకాశాలున్నాయి.
మరోవైపు భూటాన్ కు సాధ్యమైన మేర సాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని భారత్ అభయమిచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ భూటాన్ ప్రధాని షేరింగ్ ను నిన్న థింపులో కలుసుకుని చర్చలు జరిపారు. భూటాన్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడడానికి అన్ని విధాలా సాయం చేస్తామని వారు తెలిపారు.