: సీమాంధ్రలో ఒకరోజు పెట్రోల్ బంకులు బంద్
ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి 13 వరకు సీమాంధ్ర జిల్లాల్లో అన్ని పెట్రోల్ బంకులు మూసివేయనున్నారు. ఈ మేరకు విజయవాడలో 13 జిల్లాల పెట్రోల్ డీలర్లు సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోవైపు అదేరోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఆర్ టీసీ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.