: టీఆర్ఎస్ కు నిజామాబాద్ జిల్లా నేత గుడ్ బై
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆలూరు గంగారెడ్డి టీఆర్ఎస్ కు టాటా చెప్పారు. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి ఆయన రాజీనామా చేశారు. జిల్లా పార్టీలో వర్గ విభేదాలు తలెత్తడంతో బయటకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రకటన తర్వాత నేతల మధ్య అసంతృప్తి నెలకొనడంతో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతుండటం గమనార్హం.