: తిరుమల కొండకు ప్రయాణమవుతున్నారా?.. ఒక్క నిమిషం
దూర ప్రాంతాల నుంచి తిరుమల ప్రయాణం పెట్టుకున్నవారికి ఆర్టీసీ సమ్మె కారణంగా ఇబ్బందులు ఎదురు కానున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 12 నుంచి సీమాంధ్ర ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్న సంగతి తెలిసిందే. సమ్మెలో భాగంగా తిరుమల బస్సులకు మినహాయింపేమీ లేదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో, భక్తులు ఏడుకొండలు ఎక్కడానికి ప్రైవేటు వాహనాలు లాంటి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రైవేటు వాహనదారులు ఎలా ఛార్జీలు వసూలు చేస్తారో తెలియందికాదు.