: పాక్ తోక వంకర


వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ శిబిరాలపై పాక్ సైన్యం గతరాత్రి కాల్పులు జరిపింది. ఇందుకు సమాధానంగా భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఇరు సైన్యాల మధ్య ఈ కాల్పులు తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగినట్లు తెలుస్తోంది. నాలుగురోజుల కిందట పూంచ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత సైనికులను బలిదీసుకున్న పాక్, ఆ ఘటనతో తమకు సంబంధంలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News