: తిరుమలలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా రేపు వీఐపీ దర్శనం రద్దు చేశారు. వరుస సెలవులు రావడం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాంతో, వీఐపీ దర్శనానికి ఒకరోజు విరామం ఇస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. కాగా, శ్రీవారి దర్శనం కోసం ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది.