: వేలానికి ప్రిన్సెస్ డయానా దుస్తులు


బ్రిటన్ యువరాణిగా డయానా అందానికే కాదు..ఆమె ఫ్యాషన్ కు కూడా అప్పట్లో అందరూ ఫిదా అయిపోయారు. రాజరికానికి, దర్పానికి ప్రతిరూపంగా పలు సందర్భాల్లో  డయానా ధరించిన దుస్తులను వేలానికి పెట్టారు. 

వీటిలో ప్రిన్సెస్ డయానా 1992లో భారత్ పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహాల్ ముందు ఆమె ధరించిన గులాబీ రంగు గౌను కూడా ఉంది. అప్పట్లో మీడియాలో ఈ ఫొటోలు ప్రముఖంగా వచ్చాయి. ఈ గౌను ధర 65 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలికే అవకాశం ఉందని కెర్రీ టేలర్ వేలం నిర్వాహక ప్రతినిధి తెలిపారు. అలాగే బ్రూస్ ఓల్డ్ ఫీల్డ్, జంధ్రా రోడ్స్ తయారు చేసిన గౌను ఆరున్నర కోట్ల ధర పలకవచ్చంటున్నారు నిర్వాహకులు.
  
1997 ఆగస్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా కారు ప్రమాదంలో చనిపోవటంతో ఆమె అభిమానులు కలత చెందారు. ఆ ఏడాదిలోనే న్యూయార్కులోని ఓ ఛారిటీ సంస్థ కోసం ఆమె తన 10 దుస్తులను వేలం వేయాలని కోరారు. 2011 లో జరిగిన వేలంలో వీటిలో నాలుగు దుస్తులు అమ్మగా.. మిగిలిన వాటిని తాజాగా వేలం వేస్తున్నారు.

  • Loading...

More Telugu News