: థాయ్ క్రీడాకారిణితో తలపడనున్న సింధు
చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న'ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్' సెమీఫైనల్లో హైదరాబాదు క్రీడాకారిణి పివి సింధు నేడు థాయ్ లాండ్ క్రీడాకారిణి ఇంతనాన్ రచనోక్ తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత బ్యాడ్మింటన్ లో సింధు సరికొత్త చరిత్ర సృష్టించినట్లువుతుంది. క్వార్టర్ ఫైనల్లో నిన్న చైనా ఏడవ సీడెడ్ క్రీడాకారిణిని ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన ఏకైక క్రీడాకారిణిగా ఈ తెలుగుతేజం చరిత్ర పుటల్లోకెక్కింది.