: జమ్మూ అల్లర్లలో మరో వ్యక్తి మృతి
జమ్మూలోని కిష్ట్వార్ పట్టణంలో జరిగిన మత అల్లర్లలో గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. నిన్న ఇరు మత వర్గాల మధ్య జరిగిన దాడులలో అరవింద కుమార్ అనే యువకుడు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. వీరిని చికిత్స కోసం జమ్మూలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులు దుకాణాలు, కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మరోవైపు, ఆందోళనలను అదుపు చేయడానికి అధికారులు కర్ఫ్యూ విధించారు.