: అవసరం లేకున్నా అతిగా సర్దేస్తారట!


ఆడవాళ్లు అవసరం ఉన్నా లేకున్నా... ఎక్కువగా సర్దేస్తుంటారట... ఇల్లు సర్దుడు అనుకుంటున్నారా... అదేంకాదు... ఎక్కడికైనా ప్రయాణం అంటే చాలు... ఆడవాళ్లు వెంటనే తమ బ్యాగులను సర్దేసుకుంటారట. అది కూడా చాలా ఎక్కువగా... అవసరం ఉన్నా, లేకున్నా కూడా సూట్‌కేసు నిండా బట్టలు సర్దేసుకుంటారని, తీరా ప్రయాణంలో తీసుకెళ్లిన బట్టల్లో సగం కూడా వాడరని పరిశోధకులు చెబుతున్నారు.

మహిళలు సెలవులకు, లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు బ్యాగుల్లో బోలెడన్ని బట్టలు సర్దుకుంటారట. బ్యాగులు బాగా బరువుగా మోసుకెళ్లిన తర్వాత అక్కడ తీసుకెళ్లిన వాటిలో సగం కూడా వాడమని ఈ అధ్యయనంలో వారే అంగీకరించారట. మహిళల్లోనే ఇలాంటి ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. తమ అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసుకున్న మహిళల్లో దాదాపుగా 80 శాతం మంది అవసరమైన వాటికన్నా ఎక్కువ బట్టలనే తాము సూట్‌కేసుల్లో సర్దుకుంటామని, దూరప్రయాణాల సమయంలో ఇలా ఎక్కువ బట్టలు తీసుకెళ్లడం వల్ల అదనపు లగేజీ ఛార్జీలను కూడా చెల్లించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని వారు అంగీకరించారట. మరికొందరైతే తాము ఇంటిదగ్గరినుండి మోసుకెళ్లిన లగేజీ కాకుండా అదనంగా తాము కొత్త ప్రదేశంలో కొన్న కొత్త వస్తువులతో తమ లగేజీని మరింతగా పెంచేసుకుంటామని కూడా చెప్పారట. అయితే ఇలా చెప్పిన వారు 40 శాతం మంది మాత్రమే. అయితే మహిళలు ఇలా ఎక్కువగా సర్దుకునేది కేవలం బట్టలే అనుకోకండి... అందులో చెప్పులు, ఇంకా పలురకాలైన అలంకరణ సామగ్రి, ఇంకా ఇతరాలైన సరుకులూ ఇలా చాలా వస్తువుల లిస్టునే వారు మోసుకెళతారట. పైగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కొన్ని రోజుల ముందునుండి బ్యాగులను సర్దడం ప్రారంభిస్తామని సదరు మహిళలు అంగీకరించారని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News