: పంచుకోవడానికీ హద్దులుండాలి


మారుతున్న కాలంతోబాటు మనకు సంబంధించిన పలు విషయాలను మన సన్నిహితులతో పంచుకోవడం ఎక్కువవుతోంది. ఫేస్‌బుక్‌ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పంచుకోవడాలు మరీ ఎక్కువైపోయాయి. అయితే ఇలా పంచుకోవడం అనేది మరీ అతిగా ఉండకూడదని, దానివల్ల అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ ద వెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం, హెరియట్‌`వాట్‌ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో తమకు సంబంధించిన ఫోటోలను పంచుకోవడం ద్వారా అసలు బంధాలకే మోసం వస్తోందని తేలింది. సామాజిక అనుసంధాన వేదికల్లో ఎక్కువగా తమకు సంబంధించిన ఫోటోలను షేరింగ్‌ చేసుకోవడం వల్ల సన్నిహితులు, బంధువుల మధ్య వాటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని వీరి అధ్యయనంలో తేలింది.

ఒక ఫోటో సన్నిహితుల మధ్య మంచి అభిప్రాయాన్ని కలిగిస్తే... అదే ఫోటో బంధువుల మధ్య చెడు అభిప్రాయానికి దారితీసే ప్రమాదముందని, స్నేహితులకు నచ్చిన ఫోటో బంధువులకు నచ్చకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే బంధువులకు నచ్చిన ఫోటో ఇటు స్నేహితులకు నచ్చకపోవచ్చని... ఇలాంటివి అసలు బంధాలమధ్య విభేదాలు తెస్తాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News