: కిరణ్ ను కీర్తించిన గజల్ శ్రీనివాస్
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తనదైన శైలిలో కీర్తించారు. నిన్న మీడియాతో మాట్లాడిన సీఎం అద్భుత విషయాలను చెప్పారన్నారు. తెలుగు ప్రజలు ఎందుకు కలిసుండాలో ఆయన విడమర్చారన్నారు. ఆయన్నందరూ ఇప్పుడు హీరోగా చూస్తున్నారని, తెలుగువారందరికీ కిరణ్ ఇప్పుడో హీరో అని పొగిడారు. ఓ తెలుగువాడిగా తాను రాష్ట్రం సమైక్యంగానే ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. 'ఎందుకు విడిపోవాలి..? ఎందుకు పడిపోవాలి..? ఇన్నాళ్లు కలిసి మెలిసి తెలుగులంతా జీవించి..' అనే ఓ ప్రత్యేక పాటను యూట్యూబ్ లో పెట్టినట్లు చెప్పారు. గజల్ శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.