: సొంత జిల్లాలోనే కిరణ్ ను సీఎంగా గుర్తించడంలేదు: కోమటిరెడ్డి


కిరణ్ ను ఆయన సొంత జిల్లాలోనే ఎవరూ సీఎంగా గుర్తించడంలేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కిరణ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. నల్గొండలో నేడు మీడియాతో మాట్లాడుతూ, సీఎం కిరణ్ ను బర్తరఫ్ చేసేంత వరకు వెంటాడతామని స్పష్టం చేశారు. ఇక కిరణ్ పైనే తమ పోరాటం సాగిస్తామన్నారు. సోనియా ప్రాపకంతో ముఖ్యమంత్రి అయిన కిరణ్ ఇప్పుడు అధిష్ఠానాన్ని ఎదిరించే మొనగాడయ్యాడా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎంను తెలంగాణ ప్రాంత మంత్రులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కిరణ్ లాంటి వ్యక్తి సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News