: శ్రీవారికి సమైక్య సెగ.. టీటీడీ నిరవధిక సమ్మె


సమైక్యాంధ్ర కోసం అన్ని వర్గాలు ఏకమమవుతున్నాయి. తెలుగు జాతిని ముక్కలు చేయడాన్ని ఖండిస్తూ సాగుతున్న ఉద్యమాల్లో విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు.. ఇలా అందరూ ఏకతాటిపై నిలుస్తున్న ఈ పోరు తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కూడా సమైక్యాంధ్రకు సమరశంఖం పూరిస్తున్నారు. ఈ నెల 12 నుంచి తాము నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు టీటీడీ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవో గోపాల్ కు నోటీసులు అందజేయనున్నారు. కాగా, ఈ నెల 12 నుంచి ఆర్టీసీ కూడా సమ్మె చేస్తుండడంతో.. తిరుపతి-తిరుమల మధ్య బస్సు సేవలు నిలిచిపోనున్నాయి.

  • Loading...

More Telugu News