: సైనాకు సాధ్యం కానిది సింధు సుసాధ్యం చేసింది


హైదరాబాదు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. 'వరల్డ్ బ్యాండ్మింటన్ ఛాంపియన్ షిప్' సెమీస్ లో అడుగుపెట్టిన తొలి భారత మహిళా షట్లర్ గా రికార్డు పుటల్లోకెక్కింది. చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో.. సింధు క్వార్టర్ ఫైనల్లో ఏడవ సీడెడ్ క్రీడాకారిణి వాంగ్ షియాన్ పై 21-18, 21-17 తేడాతో గెలిచింది.ఆరంభం నుంచి ఆసక్తిగా సాగిన ఈ పోటీలో కొంచెం తడబడిన సింధు ఎట్టకేలకు సెమీస్ కు వెళ్లింది. కాగా, పలు సూపర్ సిరీస్ టోర్నీలు గెలిచిన సైనా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఇప్పటిదాకా సెమీస్ చేరకపోవడం గమనార్హం.

కాగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో 30 ఏళ్ళ క్రితం ప్రకాశ్ పదుకొణే పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ 2011లో లండన్ లో జరిగిన ఈ టోర్నీలో కాంస్యం సాధించారు. తాజా విజయంతో సింధు కూడా ఓ పతకం ఖరారు చేసినట్టయింది.

  • Loading...

More Telugu News