: ముంబై ఆసుపత్రిలో కోలుకుంటున్న షిండే


కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల శస్త్రచికిత్స జరిగింది.72 సంవత్సరాల ఆయనకు ఊపిరితిత్తుల్లో చిన్న కణితి వంటిది పెరగడంతో ఈ నెల 4న ఆపరేషన్ చేసి తీసేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, కోలుకున్న వెంటనే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని షిండే కుమార్తె ప్రీతీ షిండే విలేకరులకు తెలిపారు. వెంటనే రోజువారీ కార్యకలాపాలకు హాజరవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News