: తెలంగాణ జేఏసీ కార్యాచరణ
తెలంగాణ రాజకీయ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తెలంగాణవ్యాప్తంగా 10, 11, 12 తేదీల్లో ర్యాలీలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా ప్రవర్తించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన ఆరోపించారు. సీఎం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించాలనుకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని సూచించారు.