: ఏడవరోజుకు చేరిన గూర్ఖాలాండు బంద్.. ఛానల్స్ నిలిపివేత
ప్రత్యేక గూర్ఖాలాండు కోసం చేస్తున్న బంద్ ఏడవరోజుకు చేరింది. ఈ రోజు గూర్ఖాలాండు జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వార్తా ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. ఛానళ్లలో వార్తలు గూర్ఖాలాండు ఉద్యమానికి మరింత ఊపిరిపోసేలా ఉన్నాయని, కాబట్టి, ప్రసారాలు ఆపివేయాలని టీవీ ఆపరేటర్లకు అధికారులు ఆదేశించారు. బంద్ కారణంగా స్థానిక వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా, గూర్ఖాలాండును ఇచ్చే ప్రసక్తే లేదని, అది పశ్చిమ బెంగాల్లో భాగమని కొన్నిరోజుల కిందట తృణమూల్ కు చెందిన ముఖ్యనేత ఒకరు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.