: రూ. 20 బ్యాలన్స్ ఉంటే కనెక్షన్ తొలగించొద్దు: ట్రాయ్


టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికాం సంస్థలకు కొత్త మార్గదర్శకాలు నిర్ధేశించింది. ఇప్పటి వరకు వినియోగదారులు ఉపయోగించకుండా పక్కన పెట్టేసే సిమ్ కార్డుల కనెక్షన్ ను టెలికాం సంస్థలు డీ యాక్టివేట్ చేస్తున్నాయి. ప్రిపెయిడ్ వినియోగదారుని ఖాతాలోని సొమ్ముకు రెక్కలొస్తున్నాయి. 

ప్రిపెయిడ్ వినియోగదారుని ఖాతాలో 20 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఖాతాను డీయాక్టివేట్ చేయకూడదని ట్రాయ్.. టెలికాం సంస్థలను ఆదేశించింది. అలాగే వినియోగంలో లేని ప్రిపెయిడ్ కనెక్షన్ లను డీ యాక్టివేట్ చేసేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది.

కొద్ది రుసుము తీసుకుని డీ యాక్టివేట్ అయిన ఖాతాని యాక్టివేట్ చేసుకునే సౌలభ్యం
వినియోగదారునికి కల్పించాలని ట్రాయ్ తెలిపింది. అలాగే ఒకే నెంబర్ ని రీయాక్టివేషన్ చేసుకునేందుకు వినియోగదారునికి 20 రోజుల సమయం ఇవ్వాలని ట్రాయ్ టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News