: కమిటీ వేయాల్సింది పార్టీ కాదు కేంద్రం : వెంకయ్యనాయుడు


సీమాంధ్ర ప్రజల ఆందోళనలపై కాంగ్రెస్ పార్టీ కమిటీని వేయడం వల్ల ప్రయోజనం ఉండదని, కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సున్నిత భావోద్వేగాలతో కూడిన అంశంపై కాంగ్రెస్ ఉద్వేగాలను రెచ్చగొడుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఒకేమాటకు కట్టుబడకుండా, రెండు నాల్కల ధోరణితో ఇరువైపుల ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వెంకయ్యనాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News