: బెంగాలీ ముస్లింలకు మమత ఈద్ బహుమానం
ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలోని ముస్లింలకు ఒక కానుక ప్రకటించారు. ఉన్నత విద్యలో మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కోల్ కతాలోని రెడ్ రోడ్డులో మత ప్రార్థనలకు హాజరైన సందర్భంగా వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు చెందిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, భిన్న రంగాల్లో నిపుణులు కావాలని అభిలాష వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2014 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో మైనారిటీలకు రిజర్వేషన్లను అమలు చేస్తామని మమత తెలిపారు. అలాగే, మైనారిటీలకు షాపులు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.