: 'ఇండియన్ రెస్టారెంట్' లో ఒబామా పుట్టినరోజు విందు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ ఆదివారం తన 52వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆరోజు విందును యూఎస్ లోని ఇండియన్ రెస్టారెంట్ 'రసిక' లో భార్య మిచెల్లీ, పిల్లలతో కలిసి ఆరగించారట. ఈ సందర్భంగా రెస్టారెంటు వారు ప్రత్యేక వంటకాలు చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు కుటుంబసభ్యులు, స్నేహితులతో క్యాంప్ డేవిడ్ వద్ద ఒబామా పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారని తెలిపారు. కాగా, న్యూఢిల్లీకి చెందిన అశోక్ బాబ్జీ 2005 డిసెంబరులో 'రసిక' రెస్టారెంటును అమెరికాలో ప్రారంభించాడు. భారతీయ వంటకాలతో పాటు విభిన్న విదేశీ వంటకాలు ఈ రెస్టారెంటు ప్రత్యేకత. అటు దేశాధ్యక్షుడు, ఆయన సతీమణి మిచెల్లీ వచ్చారని తెలిసి ప్రజలు ఆ రెస్టారెంటు బయట బారులు తీరారట. దాంతో, హోటల్ కు ఎప్పుడూ లేని ప్రాముఖ్యత వచ్చిందని ఓ వార్త సంస్థ తెలిపింది.