: ఎమ్మెల్యే పదవికి ధర్మాన రాజీనామా
శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈ ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపారు. ఇతర ఎమ్మెల్యేలు జుట్టు జగన్నాయకులు (పలాస), మీసాల నీలకంఠం (ఎచ్చెర్ల), కొర్ల భారతి (టెక్కలి), బొడ్డేపల్లి సత్యవతి (ఆముదాలవలస) కూడా పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరితోపాటు ఎమ్మెల్సీ పీరుకట్ల ప్రసాద్ కూడా పదవికి రాజీనామా చేశారు. కాగా, 'క్విడ్ ప్రోకో' వ్యవహారంలో ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కిందట ధర్మాన మంత్రి పదవిని వీడిన సంగతి తెలిసిందే.